పెంచి ఇస్తామన్న పెన్షన్లను తెలంగాణ రాష్ట్రంలో తక్షణం అమలు చేయాలి
Uncategorizedవంగూరి ఆనందరావు మాదిగ ఎంఎస్పీ జాతీయ నాయకులు వరంగల్ జిల్లా ఇన్చార్జి_తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఆసరా పెంచిందారులకు పెంచి ఇస్తామన్న పెన్షన్లను వెంటనే రాష్ట్రంలో అమలు చేయాలని ఎం ఎస్పీ జాతీయ నాయకులు వరంగల్ జిల్లా ఇన్చార్జి వంగూరు ఆనందరావు మాదిగ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక మాదిగ లు డిమాండ్ చేసినారు వరంగల్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ సి టైప్ బస్తీలో వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు వరంగల్ మండల ఇన్చార్జి గంగవరపు మల్లన్న మాదిగ అధ్యక్షతన జరిగిన వృద్ధుల వితంతువుల వికలాంగుల ఆసరా పెన్షన్ దారుల బస్తి సమావేశంలో ఆనందరావు మాదిగ మరియు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ జిల్లా కో ఇంచార్జ సందే కార్తీక్ మాదిగలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నప్పటికీ నేటికీ రాష్ట్రంలో ఎన్నికల ముందు రాష్ట్రంలోని వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఆసరా పింఛన్దారులకు పెంచి ఇస్తామన్న పెన్షన్లను తక్షణం రాష్ట్రంలో అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఈనెల 29వ తేదీన వరంగల్ జిల్లా కేంద్రంలో వరంగల్ జిల్లా పరిధిలో ని వికలాంగులు వృద్ధుల వితంతువుల ఆసరా పెన్షన్ దారుల జిల్లా సన్నాహక మహాసభ జరుగుతుందని ఈ జిల్లా సన్నాక మహాసభకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారని తెలియజేసినారు జిల్లాలోని అన్ని మండలా ల పరిధిలోని వృద్ధులు వితంతువులు ఆసరా పెన్షన్ దారులు వేలాదిగా పాల్గొని 29వ తేదీన జరిగే సన్నాహక మహాసభను జయప్రదం చేయాలని కోరినారు ఈ బస్తి సమావేశంలో వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ వీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ మాదిగ వరంగల్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా సీనియర్ నాయకులు కానూరి చంద్రశేఖర్ వరంగల్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బాబు రాజు యాదవ్ వరంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి అనిల్ మాదిగ బస్తి కమిటీ వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఆసరా పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి నాయకులు సంగారబోయిన విజయ రాస మల్ల కవిత పుష్కమల్ల రాధ వీర సనాలి నాగమణి కొండపురుజు కనకవ్వ దామెర లక్ష్మణ్ ఉప్పు వెంకటమ్మ ఉప్పు వెంకటమ్మ రాయరాట్ల భద్రయ్య వల్లం కొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు