ఈ69న్యూస్,పర్వతగిరి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ఇటీవల మరణించిన గ్రామ రైతు సమితి అధ్యక్షుడు ఈరగాని సాంబయ్య సతీమణి నిర్మల భౌతిక విలీనం కావడంతో,వారి కుటుంబాన్ని మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రాములు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరుస్తూ,ప్రతి విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలని సూచించారు.ఈ సందర్శనలో మాజీ జెడ్పీటీసీ లూనావత్ పంతులు,మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ సర్వర్,నాయకులు గోనె సంపత్,కంటెం ఏకాంతం తదితరులు కూడా పాల్గొన్నారు.