ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో కల ఫర్టిలైజర్ షాపులను మండల అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఏవో సారయ్య తో పాటు కొత్తపల్లి గోరి ఎమ్మార్వో లక్ష్మీరాజయ్య, కొత్తపల్లి గోరి ఎస్సై సాకపురం దివ్య పాల్గొని,మండలంలో గల షాపులలో తనిఖీలు నిర్వహించి స్టాక్ వివరాలను, రిజిస్టర్, ధరల పట్టికలను పరిశీలించారు. యూరియా కావాల్సిన రైతులు పట్టా పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తో యూరియా పొందాలని ఏవో సారయ్య రైతులను కోరారు. ఫర్టిలైజర్ షాపులలో ధరల పట్టికను, స్టాక్ వివరాలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని యజమానులను ఆదేశించారు.