రేగొండ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం
Uncategorized
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తూర్పాటి మల్లేష్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు పాల్గొని,మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు సుపరిపాలన అందిస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంమును బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తున్నాడని అందులో భాగంగానే జీఎస్టీ స్లాబ్లను తగ్గిస్తూ ప్రతి పేద కుటుంబంకు లబ్ధి చేకూర్చేలా గృహ అవసరాలకు నిత్యవసర వస్తువులకు ఎలక్ట్రానిక్ వస్తువులకు జీఎస్టీ పన్ను రాయితీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మోడీ ప్రభుత్వాన్ని,మోడీ ని వ్యక్తిగతంగా విమర్శించే ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని మోడీ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని ప్రజా ప్రభుత్వంలో ప్రజలే అధిపతులుగా ఉంటారని ఇలాంటి విషయాలు తెలుసుకోలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇప్పటికైనా వారి వక్రబుద్ధిని మార్చుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో రాబోవు స్థానిక ఎన్నికలలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుందని ప్రజలందరూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల ద్వారా బుద్ధి చెబుతారని ముఖ్యముగా పేద ప్రజలు కాయ కష్టం చేసి వారి భవిష్యత్తు తరాలకు ఆర్థికంగా ఉపయోగపడడానికి ఇన్సూరెన్స్ లు కట్టుకుంటారని వాటి పైన కూడా జీఎస్టీ పనులు లేకుండా చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు మెతుకుపల్లి బుచ్చిరెడ్డి,మండల ఉపాధ్యక్షులు ఎర్రబాటి శివకృష్ణ,ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు కురాకుల మల్లయ్య,బూత్ అధ్యక్షులు అంబటి రాజకుమార్,చల్ల విక్రమ్,మందల రఘు,చక్రపాణి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.