జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్
చొప్పదండి మండలంలో ఈరోజు చొప్పదండి మండల ఇంచార్జ్ రంగరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాగృతిలో మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మమత రెడ్డి మరియు రాంచంద్రారెడ్డిలపాటు
మ్యాకల అరుణ్,గోగులకోండ మధు,గోగులకండ మహేందర్,గొల్లపల్లి రమేష్,
బోడ రాకేష్ రెడ్డి తదితరులు చేరినారు. వారికి జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో జాగృతి బలోపేతంలో భాగంగా పలువురు నాయకులు కవితక్క నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని వారు అన్నారు. చొప్పదండి నియోజకవర్గం లో జాగృతి బలోపేతం చేసి త్వరలోనే అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని గత ఇరవై సంవత్సరాలుగా జాగృతి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కాపాడడం కోసం పనిచేస్తుందని చొప్పదండి నియోజకవర్గంలో జాగృతికి బలమైన నిర్మాణం ఉందని. కవితక్క చేపట్టిన జనం బాట కార్యక్రమ అనంతరం ప్రజల నిర్ణయానికి అనుగుణంగా కవితక్క జాగృతిని రాజకీయ పార్టీలతో సమానంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్మాణం చేస్తుందని జాగృతి దృష్టికి ప్రజలు ఇప్పటికే అనేక సమస్యలను తీసుకు వస్తున్నారని కవితక్క వాటన్నిటికీ పరిష్కారానికి ప్రత్యేకమైన కార్యాచరణతో సంబంధిత శాఖల దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారని ఈ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహిస్తే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నారని జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడు శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్, చొప్పదండి మండల అధ్యక్షులు పిట్టల సత్యం తదితరులు పాల్గొన్నారు