
హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని నయరా పెట్రోల్ బంక్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపుగా వెళ్తున్న ట్రాక్టర్ను అధిక వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఢీకొన్న దెబ్బకు ట్రాక్టర్ ఇంజిన్ విడిపోయి రోడ్డుపై పడిపోయింది.ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు కాగా, వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సుంకరి రాంచంద్రు గాయాలతో బయటపడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలన చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.