
ఈ 69న్యూస్ సత్తుపల్లి, మార్చి 06
సత్తుపల్లి మండల పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే, మండలంలోని సదాశివునిపేట గ్రామ సమీపంలో ఉన్న సదాశివుని దేవాలయం వద్ద రాత్రి సుమారు 8 గంటల సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు వేగంగా వచ్చి ఢీకొట్టారు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న వేంసూరు మండల 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి కాకర్ల మాధవ్, పైలట్ కొండ్రు రవి ఘటన స్థలానికి చేరుకుని యువకుల మరణాన్ని నిర్ధారించారు. మృతులు సమీపంలోని సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల మనోజ్ (18), తండ్రి రామకృష్ణ మరియు గద్దల కార్తీక్ (20), తండ్రి రాంబాబు గా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల రోదనలతో ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.