
ఈ 69న్యూస్
జఫర్గడ్:ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ జఫర్గడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం రోజుల కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఒక సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జఫర్గడ్ అధ్యక్షుడు పూర్ణచందర్ మాట్లాడుతూ దాంశెట్టి శ్రావ్య – సోమేశ్వర్ దంపతుల పుత్రిక చైత్ర పుట్టినరోజు సందర్భంగా స్టేషన్ ఘన్పూర్కు చెందిన నిరుపేద మహిళ అయితా స్రవంతి కుటుంబానికి జీవనోపాధి కోసం ఉపయోగపడే విధంగా రూ.10,500 విలువైన కుట్టు మిషన్ను వారి సహకారంతో అందజేసినట్లు తెలిపారు.ఈ కుట్టు మిషన్ ద్వారా ఆ కుటుంబానికి ఉపాధి లభించి జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ కర్ణాకర్ రెడ్డి, జఫర్గడ్ క్లబ్ సెక్రటరీ అంచూరి యుగంధర్, సభ్యులు శివప్రసాద్, అక్షయతో పాటు స్టేషన్ ఘన్పూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.