
69 న్యూస్ వెంసూర్ :వేంసూరు మండలం శంభునిగూడెం గ్రామంలో ఎ.యన్.ఆర్. ఆరు పథకాలలో భాగంగా “ఎ.యన్.ఆర్. మరణ సహాయ పథకం” కింద గ్రామానికి చెందిన ఇండ్ల రుక్మిణి మరణించడంతో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దకర్మ నిర్వహణకు ఉపయోగపడే విధంగా 100 కిలోల బియ్యాన్ని గ్రామ సర్పంచ్ అర్వపల్లి నరసింహారావు అందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అర్వపల్లి నరసింహారావు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.