
మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సన్మానం–అనంతరం ఇఫ్తార్ విందులో షిర్కత్
ఈ69 న్యూస్ భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సేవలను గుర్తిస్తూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారికి శాలువాలతో సన్మానం చేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో మున్సిపల్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.నగర పరిశుభ్రత, ప్రజా సేవల నిర్వహణలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు మరియు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచేందుకు కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్,వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.అనంతరం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూరునగర్ ప్రాంతంలోని 1000 క్వార్టర్స్ వద్ద జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్‌తో కలిసి ముస్లిం సోదరులతో సౌహార్దంగా మమేకమయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పర్వదినం పరస్పర సహకారం, సోదరభావానికి ప్రతీక అని అన్నారు. సమాజంలో అన్ని మతాల మధ్య ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.