ఆ మలుపు లో వీధి వ్యాపారం"పట్టని అధికారులు"
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల మర్లపాడు గ్రామ కూడలి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు,చింతలపూడి,తెలంగాణలో నీ కందుకూరు,భీమవరం గ్రామాలకు పోవు రహదారి కలదు.అట్టి రహదారి మూల మలుపు లో సత్తుపల్లి,విజయవాడ ల నుండి వాహనాలు మలుపు తిరుగుతుంటాయి.అక్కడే వీధి వ్యాపారాలు యదేచ్ఛగా నిర్వహించడం చేత ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.శనివారం అటుగా వెళ్లిన నేటి ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నిఘా నేత్రానికి మెడిప్లస్ సంస్థ తమ ఉత్పదనలను వీధిలో ఉంచి అమ్మకాలు జరుపుతున్న దృశ్యం చిక్కింది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా అయితే ప్రమాదాల నివారణకు చర్యలేవి అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి ఇప్పటికైన అధికారులు పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.