గ్రామ పంచాయతీ భవన పనులు ప్రారంభం
మరిపెడ మండలం లచ్చ తండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా, భవన స్లాబ్ పనులను మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వ నిధులతో త్వరలోనే భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ సర్పంచ్
గుగులోత్ సరోజ నరేందర్, ఉప సర్పంచ్
బాలు నాయక్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు
విసారపు శ్రీపాల్ రెడ్డి,
కొంపెల్లి సురేందర్ రెడ్డి నాయకులు మరిపెడ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్
అక్కినపల్లి వెంకట్ సాయి , గ్రామ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.