అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు
రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు రేగొండ ఎస్సై డి. సుధాకర్ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టేకుమట్ల మండలానికి చెందిన ట్రాక్టర్ యజమాని పెసరు విగ్నేష్, డ్రైవర్ ఉడత అనిల్ అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన కేసు నమోదు చేశారు.అక్రమంగా ఇసుక రవాణా చేయడం చట్ట విరుద్ధమని ఎస్సై పేర్కొన్నారు. సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.అలాగే ఈ ప్రాంతంలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.