రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)
కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వెంటనే అమలు తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించారు.ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర ప్రతినిధులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ని కలవడం జరిగింది.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా కర్ణాటక రాష్ట్రంలో మాదిగలు వర్గీకరణ జరగాలని పోరాటాలు నిర్వహించిన సందర్భంగా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమలులోకి తీసుకురావాలని మందకృష్ణ మాదిగ కోరారు .ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ఉద్యమ ప్రతినిధులు పాల్గొన్నారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)