
ఈ69న్యూస్ న్యూఢిల్లీ/హనుమకొండ, మార్చి 16:
తెలంగాణ రాష్ట్ర రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ Kadiyam Kavya లోక్‌సభలో గళమెత్తారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన Indian Railways మంత్రిత్వ శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో పాల్గొని తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.రాష్ట్రం ఐటీ, ఫార్మా మరియు పారిశ్రామిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ రైల్వే మౌలిక వసతులు అదే స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఎంపీ పేర్కొన్నారు. ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న Kazipet Junction రైల్వే తయారీ యూనిట్‌ను తక్షణమే ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు.కాజీపేటలో ఏర్పాటు కానున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలకు తాను నాయకత్వం వహిస్తానని తెలిపారు.దేశంలో అత్యంత రద్దీగా మారుతున్న కాజీపేట జంక్షన్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతిపాదించిన రైల్ అండర్‌పాస్, రైల్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కోసం కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే జోన్ లేదా బలమైన సబ్జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరు, పుణే నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైల్వే కారిడార్ల అమలుకు స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించి పనులు వేగవంతం చేయాలని కూడా ఎంపీ విజ్ఞప్తి చేశారు.తెలంగాణలో వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు ట్రాక్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డా. కడియం కావ్య కోరారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.