
ఈ69న్యూస్ జఫర్గడ్, మార్చి 17:
యాదవులకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు గొర్రెల, మేకల పెంపకదారులకు జీవనోపాధి కల్పించాలని స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య కోరారు. ఈ మేరకు ఆయన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యాదవ కులస్తుల సమస్యలను ప్రస్తావించాలని కోరారు. యాదవులకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు గొర్రెల, మేకల పెంపకానికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోని వెటర్నరీ కేంద్రాల్లో గొర్రెలు, మేకలకు అవసరమైన మందులను వెంటనే అందుబాటులో ఉంచాలని కోరారు.
వినతి పత్రంపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ, మండల కాంగ్రెస్ నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.