అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు
రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.ఈ విషయాన్ని ఎస్సై డి. సుధాకర్ వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం, టేకుమట్ల మండలానికి చెందిన ట్రాక్టర్ యజమాని శ్రీకాంత్ సూచనల మేరకు డ్రైవర్ వినయ్ ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సమయంలో పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు.వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై డి. సుధాకర్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.సరైన అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత వ్యక్తులపై తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రకృతి వనరుల పరిరక్షణ దృష్ట్యా అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.