యస్జీటి ఉపాధ్యాయుల మండల ఫోరం నూతన కమిటీ ఎన్నిక
యస్జీటి ఉపాధ్యాయుల మరిపెడ మండల ఫోరం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు పెనుగొండ ప్రవీణ్ కుమార్ తెలిపారు.యస్జీటి ఫోరం మరిపెడ మండల అధ్యక్షుడిగా గండి కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా మాలోత్ భరత్, కోశాధికారిగా తల్లాడ శ్యామ్,గౌరవ అధ్యక్షులు గా జి.వెంకన్న,జి.మంగిలాల్ ఉపాధ్యక్షులుగా యం.లింగయ్య,యం.చంద్రశేఖర్,కె.యాకయ్య,మహిళా కార్యదర్శులుగా యస్,రజిత,జి.శోభారాణి,సంయుక్త కార్యదర్శులుగా బి.విజయ్ కిరణ్,జె.వినోద్ కుమార్,జిల్లా కౌన్సిలర్ లుగా పి.యాదగిరి,డి.లింగయ్య,వి.సాంబశివరావు,పి.వీరన్న,సోషల్ మీడియా కన్వీనర్ గా వి.రాజశేఖర్ ఎన్నికైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యస్జీటి ఉపాధ్యాయుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పని చేయాలని అన్నారు.యస్జీటి లో పై వివక్ష రూపు మాపే వరకు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.రాబోయే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో యస్జీటి లకు ఓటు హక్కు కల్పించాలని అన్నారు.