తెలంగాణ రైతు సంఘం పిలుపు
తెలంగాణ రైతు సంఘం పిలుపు
తెలుగు గళం న్యూస్ హైదరాబాద్, ఏప్రిల్ 27
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు కొత్తగూడెంలో విజయవంతంగా జరిగాయని, మహాసభలో 32 కీలక తీర్మానాలు ఆమోదించామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలిపారు.సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు కూడా పాల్గొన్నారు.మహాసభలో 93 మంది సభ్యులతో కొత్త రాష్ట్ర కమిటీని, 29 మంది ఆఫీస్బేరర్లను ఎన్నుకున్నట్లు తెలిపారు.రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్ రావు, ప్రధాన కార్యదర్శిగా తీగల సాగర్, కోశాధికారిగా మూడ్ శోభన్ ఎన్నికైనట్లు వెల్లడించారు.వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలు ఆమోదించామని తెలిపారు. శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక అమలు, గిట్టుబాటు ధరల కల్పన, పంటల బీమా పథకం, రుణమాఫీ చట్టం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కౌలు రైతులకు రక్షణ, మహిళా రైతులకు హక్కులు, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ సంస్కరణలు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయని చెప్పారు.అలాగే పామాయిల్, మిర్చి, పసుపు, మామిడి రైతుల సమస్యల పరిష్కారం, గిడ్డంగుల ఏర్పాటు, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు పంటల కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలుపై ప్రచారం, కౌలు రైతులకు హక్కు పత్రాల కోసం ఆందోళనలు, అటవీ హక్కుల చట్టం అమలుపై ఏజెన్సీ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాల రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించి, లీటరుకు రూ.5 ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశం