గ్రామ పార్టీ అధ్యక్షులు బండి రంజిత్
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ఎగురవేసిన గులాబీ జెండా నేడు తెలంగాణ ప్రగతికి, ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు బండి రంజిత్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు జూపక శ్రీనివాస్ మాట్లాడుతూ.. అసాధ్యమనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదేనని కొనియాడారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించి, గత పదేళ్లలో అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోడిమాల రవి, సోషల్ మీడియా కన్వీనర్ వంగరి శంకర్, మాచపాక తిరుపతి, మాచపాక కిరణ్, వంగరి మహేందర్, ఒన్నాల శంకర్, చెక్క భద్రయ్య, కోడిమాల దేవేందర్, ముప్పు అనిల్ పాల్గొన్నారు. అలాగే యూత్ అధ్యక్షులు కోడిమాల విజేందర్, కోడిమాల శ్రీకాంత్ (బాలరాజ్), ఒన్నాల రామకృష్ణ, తౌటు కిషన్, ఇతర పార్టీ శ్రేణులు, గ్రామస్థులు పాల్గొని “జై తెలంగాణ – జై కేసీఆర్” అంటూ నినాదాలు చేశారు.