ప్రభుత్వ ఉన్నత పాఠశాల టాపర్స్‌కు ఘన సన్మానం
ప్రభుత్వ ఉన్నత పాఠశాల టాపర్స్‌కు ఘన సన్మానం
గ్రామ సర్పంచ్ ఐలోని రజిత అశోక్ వారికి ఆర్థిక సహాయం అందించారూ
• మొదటి ర్యాంక్ వచ్చిన కత్తి అంజలి కి రూ.10016
• రెండవ ర్యాంక్ వచ్చిన పిండి రాంచరణ్ కి రూ.5016
• ముడవ ర్యాంక్ వచ్చిన షెక్ సమ్రీన్ రూ .3016
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం లోని గవర్నమెంట్ పదోవ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క ప్రతిభను కనబరిచినారూ గ్రామ సర్పంచ్ ఐలోని రజిత అశోక్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పదోవ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క ప్రతిభను కనబరిచినా ప్రథమ ర్యాంక్ కత్తి అంజలి -535/600 . ద్వితీయ ర్యాంక్ పిండి రాంచరణ్ -532/600 .తృతీయ ర్యాంక్ షెక్ సమ్రీన్ -476/600. ర్యాంకులను సాధించి గ్రామంలోని తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ ని మించిన విద్య ఇక్కడ బోధించబడుతుంది.అనే తెలియపరుస్తూ జిల్లా సెకండరీ పాఠశాలకి మరియు లక్నేపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఇలానే మన గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ వారి తల్లిదండ్రులు మన పిల్లల భవిష్యత్తు బాగుండేలా మన గ్రామం మన బడి అనే నినాదంతో గ్రామంలో పిల్లలందరూ బడి బాటలో భాగంగా మున్ముందు విద్యార్థిని విద్యార్థులు అందరూ మన గ్రామ స్కూల్లో విద్యను అభ్యసించి మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రథమ మరియు ద్వితీయ మరియు తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు లక్నేపల్లి గ్రామ పంచాయతీ తరపున ఐలోని రజిత అశోక్ సన్మానించి వారికి నగదు బహుమతిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కత్తి అంజలి కి రూ.10016 రెండవ ర్యాంక్ వచ్చిన పిండి రాంచరణ్ కి రూ.5016 ముడవ ర్యాంక్ వచ్చిన షెక్ సమ్రీన్ రూ .3016 అందించడం జరిగింది. మన ఊరు మనబడినీ కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తుని నిర్మించుకుందాం. లక్నేపల్లి గ్రామానికి నిజంగా గర్వకారణమైన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అందరి హృదయాలను ఆనందంతో నింపారు. సాధారణ కుటుంబాల్లో పుట్టి, పరిమిత అవకాశాల మధ్య కూడా పెద్ద పెద్ద కలలు కంటూ , కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్న మన పిల్లలు నిజమైన స్ఫూర్తి. వారి వెనుక నిలిచిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మరియు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా వందనాలు మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ స్కూల్స్‌పై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వ పాఠశాల కూడా నాణ్యమైన విద్యను అందించే ఆలయం మనం నమ్మకం పెంచుకుని సహకారం అందిస్తే బడి మన పిల్లల భవిష్యత్తును వెలిగించే దీపంగా మారుతుంది. ప్రతి నెలలో కనీసం ఒకసారి అయినా తల్లిదండ్రులంతా కలిసి పిల్లల చదువు గురించి చర్చించాలి. వారి కలలు, లక్ష్యాలు తెలుసుకుని, వారికి తోడ్పాటు అందించాలి. ఒక చిన్న ప్రోత్సాహం కూడా ఒక పిల్లవాడి జీవితాన్ని మార్చగలదు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాదం రాజ్ కుమార్, వార్డ్ మెంబర్ పరచికపు సంతోష్, కత్తి కిరణ్, ఎండి రహీం, సూదుల మహేందర్, కత్తి రాజు పిండి రాజు, జెడ్పీఎస్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు మరియు అధ్యాపక బృందం కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.