
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
పంచాయతీరాజ్, డీఆర్డీఓ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష
హనుమకొండ, జూన్ 22
జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీరాజ్ మరియు డీఆర్డీఓ అధికారులతో గ్రామపంచాయతీ భవనాలు, మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో కొనసాగుతున్న గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభివృద్ధి పనుల అమలులో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రజలకు త్వరితగతిన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులకు అవసరమైన చోట్ల కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని, భవన నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ లేదా ఇతర సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల నాణ్యత, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ లక్ష్మీప్రసన్న, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఈఈ సైదులు రెడ్డి, డీఈలు శ్రీనివాస్‌రావు, యుగంధర్, రాజ్‌గోపాల్, ఏఈలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.