పరకాల-భూపాలపల్లి హైవేపై రోడ్డుప్రమాదం.
విధి నిర్వహణలో ఉన్న డిటిఓ(జిల్లా రవాణాధికారి) వెంకన్న బొగ్గు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీవో వెంకన్న పైనుంచి దూసుకు వెళ్లింది. నడుముపై నుంచి వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీవో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న ఇటీవలే బదిలీపై భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా వచ్చారు. 2012 సంవత్సరం బ్యాచ్ కు చెందిన డిటిఓ వెంకన్న… స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ.