సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ సమీపంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఏపీలోని తిరువూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాగమణి, హనుమంతరావు వద్దకు కిష్టారం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పెద్దలు మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావు వెళ్లి గ్రామ సమీపంలో వ్యభిచార గృహం నడపడం మంచి పద్దతి కాదు. మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి అని హెచ్చరించగా ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది.10:52ఈ క్రమంలో నాగమణి, హనుమంతరావు అనే భార్యాభర్తలు, మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావు పై కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేయడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సత్తుపల్లి 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వ్యభిచారం గృహ నిర్వహిస్తున్న భార్యాభర్తలు నాగమణి, హనుమంతరావు పరారీలో ఉండగా కొత్తగూడెం నుంచి చెందిన సోని పట్టుబడింది.ఈ సంఘటన పై వియం బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.