ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ
వరంగల్ జిల్లా:నకిలీ విత్తనాలు, గడువు ముగిసిన పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వర్ధన్నపేట ఎస్‌హెచ్‌వో సాయిబాబు హెచ్చరించారు.మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను వ్యవసాయాధికారి విజయ్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి,నాణ్యమైన విత్తనాలనే రైతులకు విక్రయించాలని డీలర్లను ఆదేశించారు.నిబంధనలు అతిక్రమిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.