వర్షం పడిందంటే రోడ్డు చిత్తడి చిత్తడి
పాఠశాలకు వెళ్లేదేలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
రోడ్డు సౌకర్యం లేక ప్రతిరోజూ బురదలోనే పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి పేరుకే మున్సిపాలిటీ..కనీస రోడ్లు, డ్రైనేజీ,వీధిలైట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు మరిపెడ మున్సిపాలిటీ 5వ వార్డు బోడ అమృత్ నాయక్ తండా ప్రజల గోడు,
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బోడ అమృత్ నాయక్ తండాలో మౌలిక వసతుల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా చిన్నారులు ప్రతిరోజూ బురద రోడ్లలో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.వర్షం పడితే రోడ్లు పూర్తిగా బురదమయంగా మారడంతో విద్యార్థులు, వృద్ధులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,పేరుకే మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ తండాలో ఇప్పటికీ సరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమస్యలపై పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, కింది స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు అంటున్నారు.మా గిరిజన బంజారా పిల్లల గోడు వినండి. మా తండాలోని సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు వంటి మౌలిక వసతులను వెంటనే కల్పించేలా చర్యలు తీసుకోవాలి” అని తండా ప్రజలు విజ్ఞప్తి చేశారు.తండా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.