మృతురాలికి ఘన నివాళులు అర్పించిన పార్టీ నాయకులు
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం – బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా
మృతురాలికి ఘన నివాళులు అర్పించిన పార్టీ నాయకులు
తెలుగు గళం ములుగు, వెంకటాపురం:
పాలంపేట గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కనకం సంపత్ కుమార్తె తేజశ్రీ ఇటీవల జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందడం తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మృతురాలి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తేజశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ, “ఒక యువ జీవితాన్ని కోల్పోవడం ఎంతో బాధాకరం. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేం. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుంది. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతురాలికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.