ఈ నెల 10 న జైల్ బరో జయప్రదం చేయండి
ఆగస్టు10 న కార్మిక,కర్షక,కూలీల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం అనుబంధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్ బరో కార్యక్రమంలో రాజకీయాలతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం సత్తుపల్లి డివిజన్ నాయకుడు రావుల రాజబాబు పిలుపునిచ్చారు.శుక్రవారం మండల పరిధిలోని లింగపాలెం గ్రామంలో జరిగిన సీపీఎం గ్రామశాఖ సమావేశంలో పాల్గొన్న రావుల మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో: సీపీఎం సీనియర్ నాయకులు కొత్తా సత్యనారాయణ,గ్రామ శాఖా కార్యదర్శి కొత్తా అప్పారావు,రాయల చెన్నారావు,సుజాత,బేతిని చెన్నారావు,రావుల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.