సత్తుపల్లి నారాయణ స్కూల్ లో వెల్లివిరిసినా దేశభక్తిసత్తుపల్లి నారాయణ స్కూల్ లో వెల్లివిరిసినా దేశభక్తి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

సత్తుపల్లి నారాయణ స్కూల్ లో వెల్లివిరిసినా దేశభక్తి

సత్తుపల్లి నారాయణ స్కూల్ లో వెల్లివిరిసినా దేశభక్తి

సత్తుపల్లి పట్టణంలో గల నారాయణ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలో దేశభక్తి, ఆనందం, ఉత్సాహం వెళ్లివిరిసాయి.జాతీయ జెండా రెపరెపల మధ్య విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దేశభక్తి భావాలతో వేడుకల్లో పాల్గొన్నారు.విద్యార్థులు ప్రత్యేక దేశభక్తి వస్త్రధారణలో పాల్గొని, జాతీయ నాయకులు మరియు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణతో ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. వారి ఉత్సాహభరితమైన ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
ఏ.జి.ఏం. రామ్ కీ మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశం పట్ల ప్రేమ, క్రమశిక్షణ మరియు బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తూ, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్ ఐ. క్రాంతి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, మంచి విలువలు, క్రమశిక్షణ మరియు బాధ్యతతో ఎదగాలని విద్యార్థులకు సూచించారు.ప్రిన్సిపల్ రామమూర్తి తన ప్రసంగంలో స్వాతంత్ర్యం మనకు లభించిన గొప్ప వరమని, దానిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని తెలిపారు. విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శనలను అభినందిస్తూ, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సహకారాన్ని ప్రశంసించారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా చిన్న చిన్న సందేశాల ద్వారా విద్యార్థులకు దేశభక్తి, మంచి విలువలు మరియు సమాజం పట్ల బాధ్యత గురించి తెలియజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థుల ప్రత్యేక వస్త్రధారణ, అద్భుతమైన ప్రదర్శనలు, అతిథుల ప్రేరణాత్మక ప్రసంగాలు మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఈ వేడుక ఒక మరపురాని దేశభక్తి పండుగగా నిలిచింది.ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లు ప్రవీణ్, వినోదలక్ష్మి, నీలిమ, అకాడమిక్ డీన్ రామకృష్ణ , వైస్ ప్రిన్సిపల్ రమ్య,ఏ.ఓ. భరత్,వ్యాయామ ఉపాధ్యాయులు గోపిరాజ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ మన హక్కు… దేశ సేవ మన బాధ్యత!” అనే స్ఫూర్తిదాయక సందేశంతో వేడుకలు ఘనంగా ముగిశాయి

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *