
స్టేషన్ ఘనపూర్, ఈ69న్యూస్, సెప్టెంబర్ 08
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపుమేరకు మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు ల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ విగ్రహం నుండి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ఏర్పడిన అసెంబ్లీ స్పీకర్ను అవమానించే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సరికాదని అన్నారు.స్పీకర్ కన్నీళ్లు పెట్టుకునే విధంగా అహంకారంగా మాట్లాడారు. 14 సంవత్సరాలు తెలంగాణ సెంటిమెంట్ తో బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు.10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అయినా కూడా పదవి మీద వ్యామోహం తగ్గలేదు. అధికారం మీద మోజుతో లక్షల కోట్లు దోచుకున్నారు.ఎస్సి,ఎస్టీలు ద్వితీయ స్థానం అయితే బీఆర్ఎస్ నాయకులు ప్రథమ స్థానంలో ఉన్న విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.బిఆర్ఎస్ నాయకులుముఖ్యమంత్రి పదవి మా కుటుంబానికి రావాలని అనుకుంటూనే రోడ్లపైకి వచ్చి కొత్త పార్టీలు పెట్టారు.బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రౌడీలుగా అసెంబ్లీలో మాట్లాడడం స్పీకర్ ని కించపరచడం దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి మన రాష్ట్రంలోనే జరిగిందని అన్నారు.అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్,మార్కెట్ ఛైర్మన్ లావణ్య,లింగాజీ,బెలిదే వెంకన్న,సుభాష్ చందర్ రెడ్డి,నీల గట్టయ్య,చేపూరి వినోద్,కొలిపాక సతీష్,పోగుల సారంగపాణి,పొన్నం రవి,బూర్ల శంకర్,కనకం రమేష్,సురేష్,గన్ను నరసింహులు,సింగపురం దయాకర్,పెసరు సారయ్య,కోటి మరియు మండలాల అధ్యక్షులు,గ్రామాల అధ్యక్షులు సర్పంచ్ లు,సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
