E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ25 August, 2026E69NEWS

పాలకుర్తి:కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ఈ69న్యూస్ పాలకుర్తి ఆగస్టు 25

పాలకుర్తి మండలం దుబ్బతండా ఎస్‌పీ గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్‌ హపావత్‌ మంజుల భర్త నరేష్‌, ఉపసర్పంచ్‌ భూక్య కిషన్‌, వార్డు సభ్యుడు గూగులోతు జలంధర్‌, బీఆర్‌ఎస్‌ గ్రామ యూత్‌ అధ్యక్షుడు బుక్య బాలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పోగు శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, శాతపురం గ్రామ మాజీ ఉపసర్పంచ్‌ మారుజోడు సంతోష్‌, దుబ్బతండా మాజీ ఉపసర్పంచ్‌ బానోతు కిషన్‌, భూక్య భాస్కర్‌, భూక్య చిన్న తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *