ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసిజీ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియంప్రభుత్వ ఆసుపత్రిలో ఈసిజీ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసిజీ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసిజీ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

స్టేషన్ ఘనపూర్ లోని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈసిజీ మిషన్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా స్వయంగా ఎమ్మెల్యే ఈసిజీ టెస్ట్ చేయించుకున్నారు. ఘనపూర్ ఏరియా ఆసుపత్రిలో ఈసిజీ టెస్ట్ అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా మంజూరు కాబోతుందని తెలిపారు. అలాగే పూర్తి స్థాయిలో సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో 46కోట్లతో నిర్మాణం అవుతున్న 100పడకల ఆసుపత్రిని 31 డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేసి జనవరి 2027నాటికి అన్ని వసతులతో కూడిన 100పడకల ఆసుపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు సంధ్యారాణి, శ్రీనివాస్, రఘు,లక్ష్మణ్ ,ప్రవీణ్, వినోద్, రవి, అలేఖ్య, దివ్య, శివ మరియు నాయకులు కొలిపాక సతీష్,పట్టణ అధ్యక్షుడు కిషన్ రాజ్,పొన్నం రవి,కనకం రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *