సండ్రా జన్మదినం సందర్భంగా ఉచిత మంచినీటి ట్యాంకర్సండ్రా జన్మదినం సందర్భంగా ఉచిత మంచినీటి ట్యాంకర్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

సండ్రా జన్మదినం సందర్భంగా ఉచిత మంచినీటి ట్యాంకర్

సండ్రా జన్మదినం సందర్భంగా ఉచిత మంచినీటి ట్యాంకర్

మాజీ ఎమ్మెల్యే, సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకుడు సండ్రా వెంకట వీరయ్య జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ సత్తుపల్లి 2వ వార్డు కౌన్సిలర్‌ వీరపనేని రాధిక బాబి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేసి సండ్రా వెంకట వీరయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వీరపనేని రాధిక బాబి దాతలుగా ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను ప్రారంభించారు. పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా ఈ ట్యాంకర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. తాగునీటి అవసరాలు ఉన్న సమయంలో ఈ సేవ పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాన్ని చేపట్టిన వీరపనేని రాధిక బాబిని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందించారు. ఈ సందర్భంగా ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ ప్రజలకు వీరపనేని రాధిక బాబి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ కూసుంపూడి మహేష్‌, మాజీ ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొని సండ్రా వెంకట వీరయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *