అమ్మా ఎమ్మెల్యే గారు మా బాధలు జర దేకొ
సత్తుపల్లి సర్కారోళ్ళ హాస్టల్స్ గోస పట్టదా?
రోజుకు మూడు కిలోమీటర్ల పాదయాత్ర
24 లో 60 మందా?
స్లాబ్ పెచ్చులు ఊడి పడతాయని భయంతో చదవలేకపోతున్నాం సత్తుపల్లి పట్టణంలో దశబ్దాల చరిత్ర కలిగిన సర్కారోళ్ళ ఇంటర్,డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఎంతో మందిని ప్రతిభావంతులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా,ప్రయివేటు ఉద్యోగులుగా,వ్యాపార వేత్తలగా, రాజకీయనాయకులుగా తీర్చిదిద్దిన ఘనత సత్తుపల్లి ప్రభుత్వ కళాశాలలకు ఉందనటoలో సందేహంలేదు.చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా,రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల నుండి కూడ వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించడానికి ఆసక్తితో వస్తుంటారు.మరి వాళ్ళకి కావలసిన ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలలో వసతులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఇందుకు నిదర్శనం పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల అద్దం పడుతుంది.వివరాలలోకి వెళితే నాలుగేళ్ల క్రితం సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం శిధిలమై కూలిపోయింది. సొంత వసతి గృహం లేక అక్కడ ఇక్కడ విద్యార్థినిలు తల దాచుకుంటున్నారు.సత్తుపల్లి పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల,జేవిఆర్ డిగ్రీ కళాశాల, బాలికల కళాశాల,ఇతర ప్రైవేట్ కళాశాలలో,ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం వందలాది మంది ఎస్సీ బాలికలు విద్యను అభ్యసించడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు.కానివారికి హాస్టల్ నందు ఉండి చదువుకోడానికి సరియైన బిల్డింగ్, వసతులు లేక చుట్ట పక్కల పట్టణాలకు వెళ్లి చదువుకుంటున్నారు.
ఈ సందర్బంగా సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల విద్యారులు మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు.గతంలో స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనుక హాస్టల్ వుండేదని, గత నాలుగు సంవత్సరాల క్రితం కూలిపోయిందని, అప్పటి నుండి స్థానిక సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికల వసతిగృహం నందు తాత్కాలికంగా 24 మంది ఉండటానికి వీలుగా ఉండే రెండు గదులు కేటాయించారని ఆ రెండు గదులలో 60 మంది ఉంటున్నామని చాలా ఇబ్బందిగా ఉందని కన్నీరు చిందించారు. హాస్టల్ నుండి బస్టాండ్ కు సుమారు 3 కి మీ దూరం ఉంటందని, ఇందువల్ల ప్రయివేటు కాలేజిలు, ఇంజినీరింగ్ కాలేజిలలో చదివే విద్యార్థినీలైన మేము నడిచి బస్టాండ్ కు వెళ్ళటం ఇబ్బందిగా ఉందని తెలిపారు.తాత్కాలికంగా మాకు కేటాయించిన హాస్టల్ నందు రెండుగదులు వర్షంకాలంలో స్లాబ్ నుండి వర్షపునీరు కురుస్తుందని , అవి పెచ్చులు ఊడి మీద పడతాయేమోనని భయంతో చదవలేక పోతున్నామన్నారు.
ప్రభుత్వం బిల్డింగ్ కేటాయించి మాకు వసతి గృహం ఏర్పాటు చేసే లోపు, ప్రైవేట్ గా అయినా సరే మాకు వసతి గృహం ఏర్పాటు చేయాలని తెలిపారు.ఎస్సీ బాలికలకు పర్మినెంట్ వసతి గృహంను ఏర్పాటు చేయాలిని తద్వారా ఎక్కువంది విద్యార్థినులు జాయిన్ అవటానికి వీలు ఉంటుందని, ప్రభుత్వ ఉన్నత అధికారులు, స్థానిక ఎస్సీ నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాగమయిదయానంద్ చొరవ చూపి మా సమస్యను పరిష్కరించాలని తమకు శాశ్వత ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని బాలికలు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
Super coverage medam garu goodmorning.