ఆగస్టు 10 న జైల్ బరో రహదారుల దిగ్బంధనాలు
యువతను గాయపరిచినప్పుడు రాని కన్నీరు నేడు వస్తుందా పవన్?
చట్టాన్ని పథకంగా మార్చి కూలీల కడుపు కొడుతున్న మోదీ ప్రభుత్వం: మాచర్ల భారతి(సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యురాలు)
సామ్రాజ్యవాద కార్పొరేట్ వ్యవసాయo ఇండియాలో: శీలం సత్యనారాయణరెడ్డి(సీపీఎం డివిజన్ కార్యదర్శి)
లేబర్ కోడ్లు కార్మికవర్గానికి ఉరి: చలమాల విఠల్ రావు(సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు
ఆగస్టు 10 న దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై,క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తితో సీపీఎం అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన జైల్ బరో కార్యక్రమ జయప్రదం కోరుతూ శుక్రవారం సత్తుపల్లి పట్టణంలోని రావి వీరవెంకయ్య భవనంలో జరిగిన నియోజకవర్గ ప్రజాసంఘాల నేతల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యురాలు మాచర్ల భారతి మాట్లాడుతూ నాడు పల్లెల నుండి వలసలు అరికట్టి పల్లె పేదలకు పొట్ట నింపే దానికి పోరాడి సాధించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని నేటి కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ జాతిపిత గాంధీ పేరును తొలగించి గాంధీని చంపిన గాడ్సే పేరు కలుపుతూ వి.బి.జి.రామ్ జీ గా మార్చి చట్టాన్ని పథకంగా మార్చి నిధుల కేటాయింపులో కోత విధించి కూలీల పొట్ట కొడుతుందని గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కార్మికులు ఆగస్టు 10 న జరగనున్న జైల్ బరో కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.అంతే కాకుండా ఇటీవల నీట్ పరీక్షా ఫలితాల పేపర్ లీక్ పై పోరాడిన యువతను,విద్యార్థులను మోడీ సర్కారు కొట్టించి గాయపరిచిన సందర్భంలో నీకు రాని కన్నీరు నేడు ఎలా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నించారు.
అనంతరం సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కార్పొరేట్ వ్యవసాయాన్ని ఇండియా లో మోడీ సర్కారు అమలు పరిచి దేశాన్ని తాకట్టు పెట్టే కుట్ర చేస్తుందని అమెరికా విత్తనాలు నాటాలని,వచ్చిన ఉత్పత్తులను తిరిగి అమెరికా నిర్ణయించిన ధరకు అమెరికా కొనుగోలు కేంద్రాలకే విక్రయించేలా మోడీ సర్కారు ఒప్పందాలు చేసుకుంటుందని భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఆగస్టు 10 న జరగనున్న జైల్ బరో కార్యక్రమంలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గ శ్రేయస్సు కోసం పోరాటాలతో ఏర్పడిన 44 కార్మిక చట్టాలను నేటి మోడీ ప్రభుత్వం 04 లేబర్ కోడ్లగా మార్చి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా మార్పులు చేసిందన్నారు.సంఘం పెట్టుకున్నే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా,అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న 08 గంటల పని విధానాన్ని భారత్ లో 12 గంటలకు మార్చే కుట్ర చేస్తుందని వాటిని వ్యతిరేకిస్తూ ఆగస్టు 10 న జరగనున్న జైల్ బరో కార్యక్రమాలలో కార్మికులు,ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొనాలని రహదారుల దిగ్బంధనాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో: సీపీఎం జిల్లా కమిటి సభ్యులు మోరంపూడి పాండు రంగారావు,జాజిరి శ్రీనివాస్,డివిజన్ కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు,రావుల రాజబాబు,
అయినాల రామలింగేశ్వరరావు,జాజిరి జ్యోతి,తన్నీరు కృష్ణార్జునరావు,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.