ఎమ్మెల్యే కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే కడియంఎమ్మెల్యే కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే కడియం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

ఎమ్మెల్యే కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే కడియం

ఎమ్మెల్యే కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే కడియం

80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాలు, దేశ ప్రజల సంఘటిత పోరాట ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించిందని తెలిపారు. ఆ మహానుబావుల త్యాగాలను మనం గుర్తు చేసుకొని వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా భారత దేశ అభివృద్ధి పదంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో కుల, మత, ప్రాంత బేధాలు ఉండవద్దని, దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని అసమానతలు లేని సమాజం నిర్మాణం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని మనకు అందించారని పేర్కొన్నారు. దాని ఫలితాంగానే నేడు మనమందరం కూడా గౌరవంగా తల ఎత్తుకొని జీవించగలుగుతున్నామని తెలిపారు.భవిష్యత్తులో ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా రాజ్యాంగంలో ఆర్టికల్స్ పొందుపరిచారని అలా పొందు పర్చిన ఆర్టికల్ 3ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని పేర్కొన్నారు. పటిష్టమైన రాజ్యాంగం ఉన్నందువల్లనే భారత దేశం సమైక్యంగా సమగ్రంగా భిన్నత్వంలో ఏకత్వంగా పురోగమిస్తుందని తెలిపారు. రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనల్ని కాపాడుతుందని అన్నారు. ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, ఆ కుట్రలను ప్రతీ ఒక్క దేశ పౌరుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. లౌకిక దేశమైన భారత దేశాన్ని మతతత్వ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ధిని పక్కన పెట్టి దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కుల, మత, ప్రాంతాలను మర్చిపోయి అందరం కలిసి బ్రతుకుతున్న దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి వ్యవస్థను నాశనం చేయవద్దని పాలకవర్గాలు, రాజకీయ పార్టీలను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య , తీగల కర్ణాకర్ రావు, సుభాష్ చందర్ రెడ్డి, బెలిదే వెంకన్న, లింగాజీ,బూర్ల శంకర్,
కిషన్ రాజ్,కొలిపాక సతీష్,పోగుల సారంగపాణి,సింగపురం వెంకటయ్య,దయాకర్,గట్టు రమేష్, గట్టు చేరాలు, కోటి నాగరాజు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు,నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
పలు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసిన అధికారులు
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కిరణ్ ప్రకాష్ జెండా ఆవిష్కరించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. మున్సిపల్ కమిషనర్ రాధాకిషన్,వార్డు కౌన్సిలర్లు, మున్సిపాలిటీ
అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది,అంగన్వాడి మేడమ్స్,చిన్నారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
పశువుల ఆసుపత్రిలోని అసిస్టెంట్ డాక్టర్ సారంగపాణి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఫారెస్ట్ ఆఫీస్ లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెరీనా భేగం, ధర్మరాజ్,అంజయ్య పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *