కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలికాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ ద్వారా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంట కాలువలకు సాగు నీరు విడుదల చేశారు. రిజర్వాయర్ వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో దేశ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. కురిసిన కొద్దిపాటి వర్షాలకు వేసిన ఆరుతడి పంటలు, నారు మల్లు ఎండిపోతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అందులో భాగంగానే నెల రోజుల నుండి ప్రతీ రోజు అధికారులతో మాట్లాడుతూ,పంపింగ్ ను పర్యవేక్షిస్తూ దేవాదుల పరిధిలోని అన్ని రిజర్వాయర్లను నింపే ప్రయత్నం చేశామని అన్నారు. అలా చేయడం వల్లనే ఈ రోజు రిజర్వాయర్ల ద్వారా సాగు నీరు విడుదల సాధ్యం అయిందని పేర్కొన్నారు. రిజర్వాయర్ల నుండి ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో సాగు నీటి విడుదల జరుగుతుందని అన్నారు. 15రోజులు నిరంతరాయంగా నీటి విడుదల చేసి మరో 15రోజులు రిజర్వాయర్లలో నీటిని నింపి మళ్ళీ 15రోజులు నీటి విడుదల జరుగుతుందని చెప్పారు. దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సుమారు 3లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుందని తెలిపారు. రైతులు కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకొని పొదుపు గా వాడుకుంటూ పంటలను కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటికే ధర్మసాగర్, అశ్వరావుపల్లి, గండి రామారం రిజర్వాయర్ల ద్వారా సాగు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. ఘనపూర్ మెయిన్ కెనాల్ ద్వారా పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ నియోజకవర్గాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నట్లు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్ని తెలిసి కూడా కావాలని ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు చేసే అసత్యపు ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దని కోరారు. అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల పంటలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఇంతటి కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ద్వారా సాగు నీరు విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద దిక్కుగా మారిందని అన్నారు. దేవాదుల ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలో 58వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు చేరే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పంటలను కాపాడుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు చిల్లర వేషాలు పక్కన పెట్టి గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్మన్ నీలా గట్టయ్య, బెలిదే వెంకన్న, లింగాజి,చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, బూర్ల శంకర్, పోగుల సారంగపాణి ,రజా

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *