గుంతకల్లు లో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యేగుంతకల్లు లో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ15 August, 2026E69NEWS

గుంతకల్లు లో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

గుంతకల్లు లో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

గుంతకల్లు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం ఆయన క్యాంపు కార్యాలయం కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి నేరుగా పరిష్కరించడం లేదా దీర్ఘకాలిక సమస్యలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ మనమందరము కలిసికట్టుగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులను గెలిపించుకుని గుంతకల్ నియోజకవర్గం నుండి నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇవ్వాలని అందుకోసం ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పోరాడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *