పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నిధులుపేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నిధులు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ15 August, 2026E69NEWS

పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నిధులు

పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నిధులు

గుంతకల్లులోని క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి డాక్టర్ పత్తి హిమబిందు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారికి పేదవారి కుటుంబానికి పెద్ద కొడుకుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని,గుంతకల్లు నియోజకవర్గంలో 2 సంవత్సరాలలో 1015 మందికి గాను 6 కోట్ల 36 లక్షల 72 వేల రూపాయలను అందించామన్నారు. దాదాపుగా 38,39 విడుదల లో 52 మంది గాను 31,30,950 రూపాయలు నిరుపేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు.
సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్ధిదారులు మాట్లాడుతూ గుంతకల్లు నియోజకవర్గం లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మన కూటమి ప్రభుత్వం తరఫున ఎవరు పోటీ చేసిన గెలిపించుకొని తీరుతామని గుంతకల్లు నియోజకవర్గంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడుకు బహుమతిగా ఇస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తునమని కూటమి ప్రభుత్వానికి మరియు గుమ్మనూరు కుటుంబానికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు అనుబంధ కమిటీ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *