ప్రజావాణి కు ఇక నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ లేప్రజావాణి కు ఇక నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ లే
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

ప్రజావాణి కు ఇక నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ లే

ప్రజావాణి కు ఇక నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ లే

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారినీ దారెల్లి కావ్య ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. వేంసూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు.
మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మండల ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలతో ప్రతి సోమవారం కార్యాలయానికి హాజరై ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *