బీ.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణబీ.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

వరంగల్ జిల్లా:దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ కేంద్రం వద్ద బీ.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.చివరగా నాయకులు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు,బీ.ఆర్.ఎస్ మండల గ్రామ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, సామాజిక మాధ్యమాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *