కార్మికుల హక్కులను హరిస్తున్న మోడీ సర్కార్
కార్మికుల హక్కులను హరిస్తున్న మోడీ సర్కార్
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్28(తెలుగుగళం)న్యూస్: సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం రావి వీర వెంకయ్య భవన్లో జరిగింది ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ సిపిఎం జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు
మాట్లాడుతూ
కార్మికుల మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే)ను ఘనంగా నిర్వహించాలని సిపిఎం పిలుపునిచ్చింది. కార్మికులు స్వతంత్రం నాటి నుండి పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్ లు తక్షణమే రద్దు చేయాలని అన్నారు
కార్మిక వర్గం చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ రోజున, అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, కార్మిక హక్కుల హననం వంటి సమస్యలపై పోరాటాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఉందని సిపిఎం పేర్కొంది. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా స్థానికంగా ర్యాలీలు, సభలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్మిక ఐక్యతను ప్రదర్శించాలని సిపిఎం నాయకులు సిపిఎం శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, సైదా, రాము, ఓ లేటి శ్రీహరి, చెరుకు రత్నకుమారి, మరియు తదితరులు పాల్గొన్నారు.