వ్యవసాయ యంత్రాలకు డీజిల్ కొరత: కొత్తా సత్యనారాయణ
ధాన్యం కల్లాల పరిశీలన”
వరి ధాన్యం,మొక్కజొన్నలు కొనుగోలు,ఎగుమతి చేయండి: అర్వపల్లి గోపాలరావు(తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి)
తేమ శాతం లేకున్నా క్వింటాకు ఐదు కేజీలు కావాలట: మల్లూరు చంద్రశేఖర్(సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి )
సగం పైగా దళారులకు అమ్మారు: మోరంపూడి వెంకటేశ్వరరావు(రైతు సంఘం నేత)
వ్యవసాయ యంత్రాలకు డీజిల్ కొరత: కొత్తా సత్యనారాయణ(తెలంగాణ రైతుసంఘం జిల్లా నేత)
వేంసూరు,ఏప్రియల్28(తెలుగు గళం)న్యూస్: ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో మంగళవారం సీపీఎం అనుబంధ తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో నేతలు పలు గ్రామాలలో గల మొక్కజొన్నల,దాళ్వా వరి పంట కల్లాలను పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.అనంతరం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట గల విజయవాడ పోవు ప్రధాన రహదారిపై తమ పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి,సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని,తహశీల్దార్ అన్ని కల్లాలను పర్యవేక్షించాలని కోరుతూ రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని నాయబ్ తహశీల్దార్ బంతిరామ్ కు అందజేయగా ఆయన స్పందిస్తూ తహశీల్దార్ కల్లూరు సబ్ కలక్టర్ కార్యాలయం కు వెళ్ళారని రాగానే తెలిపి కలక్టర్ కు పంపుతామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జరిగిన సభలో తెలంగాణ రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి అర్వపల్లి గోపాలరావు మాట్లాడుతూ రైతులు పండించిన వరి,మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల వద్ద,రహదారుల వెంబడి,కల్లాలలో కుప్పలుగా పోసి ఉన్నాయని వాతావరణంలో మార్పులు కలుగుతున్నాయని వర్షం పడే సూచనలు అగుపిస్తున్నాయని తక్షణమే కాటాలు వేసి కొనుగోళ్లు, ఎగుమతులు ప్రారంభం చేసి రైతులను ఆదుకోవాలని లేకుంటే ఉధృత పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం పాల్గొన్న సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో దాళ్వా వరి పంట 20 వేల ఎకరాలలో,మొక్కజొన్న పంట ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారని కొన్ని గ్రామాలలో ధాన్యం తేమశాతం లేకున్నా కింటాకు ఐదు కేజీలు కోతకు సై అంటే కాటాలకు సై అని కొనుగోలు కేంద్రాల సిబ్బంది అంటూ రైతన్నలను అభద్రతకు గురి చేస్తున్నట్లు తెలిపారు.
మిల్లర్లతో జిల్లా స్థాయి నుండి కింద వరకు అధికారులు కుమ్మకయి నిలువుదోపిడీ చేయడానికి రైతులకు కుచ్చు టోపీలు పెట్టడానికి యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోందని కార్మిక కర్షక మైత్రితో పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పాల్గొన్న రైతు నేత మోరంపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేక పోవడంతో గన్నీ సంచుల కొరతతో,రాజకీయ గ్రహణంతో వేచి చూడలేక సగం పంటను దళారులకు తక్కువ ధరకు ఇప్పటికే అమ్ముకొని రైతులు నష్టపోయి ఉన్నారని,మిగిలిన పంటను కొనుగోలు చేయడంలో అలసత్వం చేయడం దుర్మార్గమని ప్రభుత్వం స్పందించాలని అన్నారు.రైతు సంఘం జిల్లా సీనియర్ నేత కొత్తా సత్యనారాయణ మాట్లాడుతూ వేసిన పంటను కోత కోయడానికి తూర్పాల పట్టడానికి వాడే యంత్రాలకు,ధాన్యాన్ని పంట చేల నుండి కొనుగోలు కేంద్రాలకు ఎగుమతి చేయడానికి ఉపయోగించే వ్యవసాయ యంత్రాలైన ట్రాక్టర్ లు నడపడానికి డీజిల్ కొరత సృష్టించడంతో అదనపు ధరకు నల్ల బజ
జారులో కొనుగోలు చేయలేక రైతులు సతమత మవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో:రైతు సంఘం నాయకులు అర్వపల్లి వెంకటేశ్వరరావు, బేతిని నాగేశ్వరరావు, డంకర శ్రీను,రైతులు మల్లేశం,మహేష్,కామేశ్వరి,విజయ నిర్మల,పుల్లయ్య,సావిత్రి,సత్యనారాయణ,ప్రభాకర్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.