వడదెబ్బ నివారణపై గని కార్మికులకు అవగాహన
జె.వి.ఆర్.ఓ.సి (JVROC) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్ ఆధ్వర్యంలో గని కార్మికులకు వేసవి జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ లలిత పాల్గొని, ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.జె.వి.ఆర్.ఓ.సి గనితో పాటు ఓబీ క్యాంప్లలోని సుషీ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్, పి.సి. పటేల్ సంస్థల వద్ద కూడా సదస్సులు నిర్వహించారు. గని మేనేజర్ బి. రాజేశ్వరరావు, ఆపరేషన్స్ మేనేజర్ జి. కళ్యాణ్ రామ్, సేఫ్టీ ఆఫీసర్ ఎస్. గోవిందు, వెల్ఫేర్ ఆఫీసర్ డి. కావ్య, ఐఎన్టీయూసీ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శ్రీధర్, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ జి. నరసింహారావు పాల్గొన్నారు.
డాక్టర్ లలిత మాట్లాడుతూ, డీహైడ్రేషన్ నివారణకు కంపెనీ అందిస్తున్న ఓఆర్ఎస్, మజ్జిగను వినియోగించుకోవాలని సూచించారు. తరచూ నీరు తాగుతూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని కార్మికులకు సూచించారు