వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గం, వర్ధన్నపేట మండలం,ఇల్లంద గ్రామ పంచాయతీ పరిధిలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణారెడ్డి సంయుక్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం మువ్వన్నెల జెండాకు గౌరవ వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ రాజు,సూపర్ వైజర్ భూక్యా వెంకన్న,డైరెక్టర్లు ఎం.డి. ఖాజమియా,బండి సంపత్ గౌడ్,ఎం.డి. మొహమ్మద్,కర్ర మాలతి రెడ్డి, బచ్చు గంగాధర్ రావు,నూనావత్ కిషన్ నాయక్, ఖాటాబోయిన సంపత్,ఎద్దు శ్రీనివాస్,అల్లా కొమురయ్య, మల్యాల దేవేందర్,పబ్బాతి సంపత్, పుల్లూరి దామోర్ తో పాటు మార్కెట్ సిబ్బంది,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
