విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు
విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు
తెలుగు గళం ఏటూరునాగారం:
ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి బోనం ఎత్తుకుని ఊరేగింపుగా పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో కళకళలాడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అమ్మవారి ఆరాధన ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల గౌరవం, సంస్కృతిపై అవగాహన, సామాజిక విలువలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, ఉపాధ్యాయులు స్రవంతి, సమత, సరిత, భాగ్యవతి, విజయలక్ష్మి, రవీందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనికతో పాఠశాలలో బోనాల వేడుకలు విజయవంతంగా ముగిశాయి.