కేబుల్ టీవీ జేఏసీ నాయకులు
తెలుగు గళం న్యూస్ హైదరాబాద్, ఏప్రిల్ 27
తెలంగాణ కేబుల్ టీవీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బి. నరసింహ చారి, బరిగెల శివ, మహేష్ ఉపాధ్యాయ తదితరులు నూతన ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుందా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా కేబుల్ టీవీ సమస్యలపై వినతి పత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు.కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే వార్తల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, నెట్వర్క్ ఆపరేటర్ల నుంచి వస్తున్న ఆర్థిక సమస్యలను వివరించారు.రాష్ట్ర స్థాయిలో 12 మందికి, జిల్లా స్థాయిలో నలుగురికి చొప్పున పాత విధానంలోనే అక్రిడేషన్లు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ అంశాలపై కమిషనర్ ముకుందా రెడ్డి సానుకూలంగా స్పందించి, కేబుల్ టీవీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు.