ధర్మసాగర్లో చలివేంద్రం ప్రారంభం
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ధర్మసాగర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మాచర్ల జ్యోతి ఎలియా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మండుతున్న ఎండల్లో గ్రామ ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్ కుమార్ , గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.