E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
బేతుపల్లి రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వేపై పొంగులేటి సమీక్ష

సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో భూ సర్వే అంశాలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
అనంతరం రైతులతో మాట్లాడి వారి భూ సమస్యలను తెలుసుకున్నారు. పేదల సొంత భూమికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇది పేదల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
