రీజియన్ స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా సత్తుపల్లి ఆర్టీసీ టీంరీజియన్ స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా సత్తుపల్లి ఆర్టీసీ టీం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ16 August, 2026E69NEWS

రీజియన్ స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా సత్తుపల్లి ఆర్టీసీ టీం

రీజియన్ స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా సత్తుపల్లి ఆర్టీసీ టీం

80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఖమ్మం రీజియన్ పరిధిలో ఉత్తమ ఉద్యోగులుగా సత్తుపల్లి ఉద్యోగులు నిలిచారు. సత్తుపల్లి డిపో ఉత్తమ ఉద్యోగులకు ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ. సరిరాం నగదు బహుమతి తో పాటు ప్రశంస పత్రాలను శనివారం అందజేశారు. జిల్లాలో అత్యధికంగా స్పెషల్ హైర్ బుకింగ్ చేసి మొదటి స్థానంలో నిలిచిన కిన్నెర. ఆనందరావు, డి.దేవయ్య హైయెస్ట్ ఇన్సెంటివ్ సెకండ్ ప్లేస్, బి రాంబాబు టీం డ్రైవర్ హైయెస్ట్ ఇన్సెంటివ్ సెకండ్ ప్రైజ్, కే. కృష్ణ బెస్ట్ కే ఎం పి ఎల్ సెకండ్ ప్రైస్, వీరితోపాటు ఆఫీస్ నుండి ఎస్కే మస్తాన్ బి ప్రత్యేక బహుమతిని ఖమ్మం రీజినల్ మేనేజర్ నుండి అందుకున్నారు. సత్తుపల్లి డిపో నుండి ఖమ్మం రీజినల్ స్థాయిలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై రీజనల్ మేనేజర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఉద్యోగులను సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన ఉద్యోగులు కూడా తమ తమ విధులలో ప్రత్యేకతను చాటుకుని సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను డిపో మేనేజర్ గురజాల లక్ష్మీనారాయణ తోపాటు తోటి ఉద్యోగులు ప్రత్యేకంగా అభినందించారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *